ఖత్రోన్ కే ఖిలాడీ నుండి గౌరవ్ ఖన్నా స్వచ్ఛంద నిష్క్రమణ
రిపోర్టర్: రాజేష్
స్థలం: India
ప్రముఖ రియాలిటీ షో ఖత్రోన్ కే ఖిలాడీ నుంచి నటుడు గౌరవ్ ఖన్నా స్వచ్ఛందంగా తప్పుకున్నారు. తన స్టంట్ తాను గెలిచినప్పటికీ, మోచేతి గాయం తీవ్రత పెరగడం వల్లనే షో నుంచి వైదొలగినట్లు ఆయన వెల్లడించారు. భవిష్యత్తులో ఆరోగ్యం మరింత క్షీణించకూడదనే ఉద్దేశంతోనే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.