చిత్తూరు తాగునీటి ప్రాజెక్టు పనులు శరవేగంగా పూర్తి చేయాలి

రిపోర్టర్: విజయ్ స్థలం: చిత్తూరు

ఉమ్మడి చిత్తూరు జిల్లా పశ్చిమ ప్రాంతంలో రూ.2,370 కోట్లతో చేపట్టిన చిత్తూరు మల్టీ విలేజ్ తాగునీటి పథకం పనులను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పరిశీలించారు. వారాంతపు లక్ష్యాలతో పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. 18 మండలాల్లోని 25 లక్షల మందికి తాగునీరు అందించే ఈ ప్రాజెక్టును నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.