మైనార్టీల హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాడాలి
రిపోర్టర్: amudala Venkanna
స్థలం: ఖమ్మం అర్బన్
ఖమ్మం నగరంలోని గిరిప్రసాద్ భవన్లో ఎస్కే సైదా అధ్యక్షతన ఇన్సాఫ్ జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తంజీమ్ ఇన్సాఫ్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మహమ్మద్ సలాం మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల హక్కుల పరిరక్షణ కోసం అందరూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. రిజర్వేషన్లు, ఉపాధి, విద్య, వైద్యంతో పాటు అన్ని వర్గాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించాలని కోరారు.