ఇందిరమ్మ టవర్స్ ఫ్లాట్ల కేటాయింపు: నవంబర్ మూడున లక్కీ డ్రా
రిపోర్టర్: సతీష్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్ లోని నాలుగు ప్రధాన నియోజకవర్గాల్ లో ఇందిరమ్మ టవర్స్ ఫ్లాట్ల కేటాయింపు ప్రక్రియ వేగవంతమైందని హౌసింగ్ బోర్డు అధికారులు తెలిపారు. రాబోయే నవంబర్ మూడో తేదీన ఆన్లైన్ లాటరీ పద్ధతి ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ గౌతమ్ స్పష్టం చేశారు. అర్హులైన నిరుపేదలకు పారదర్శకమైన రీతిలో ఇళ్లను అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన వెల్లడించారు. నవంబర్ నాలుగో తేదీన మరోసారీ ప్రత్యేక లాటరీ నిర్వహిస్తామని పేర్కొన్నారు.