బొల్లారం రైల్వే స్టేషన్లో లిఫ్ట్ ఏర్పాటుకు ఎంపీ ఈటల రాజేందర్ ప్రత్యేక చొరవ

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: మేడ్చల్ మల్కాజిగిరి

మేడ్చల్ మల్కాజిగిరి పరిధిలోని బొల్లారం రైల్వే స్టేషన్లో ప్రయాణికుల సౌకర్యార్థం రెండు వైపులా లిఫ్ట్ ఏర్పాటు చేయాలని ఎంపీ ఈటల రాజేందర్ రైల్వే ఉన్నతాధికారులను కోరారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఈ ప్రత్యేక చొరవ తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. రైల్వే స్టేషన్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి వద్ద లిఫ్ట్ సదుపాయం అందుబాటులోకి వస్తే వృద్ధులకు, దివ్యాంగులకు మరియు ప్రయాణికులకు రాకపోకలు సాగించడం ఎంతో సులువు అవుతుందని ఆయన పేర్కొన్నారు.