భారత క్రీడా రంగంపై సీవీటర్ వ్యవస్థాపకులు యశ్వంత్ దేశ్ముఖ్ ప్రశంసలు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: New Delhi

ఖేలో ఇండియా ప్రాజెక్ట్ ద్వారా దేశంలో క్రీడా సంస్కృతి మారుతోందని, రాబోయే రోజుల్లో భారత్ ప్రపంచ క్రీడా పట్టికలో ఐదు లేదా ఆరో స్థానానికి చేరుకుంటుందని సీవీటర్ వ్యవస్థాపకులు యశ్వంత్ దేశ్ముఖ్ వెల్లడించారు. కొన్ని పతకాల రంగులు మారినప్పటికీ, సరికొత్త క్రీడాంశాల్లోనూ భారత్ పతకాలు సాధిస్తోందని ఆయన పేర్కొంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఈ ప్రగతి భారత క్రీడా భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తోందని పలువురు విశ్లేషిస్తున్నారు.