'బీఆర్ఎస్ ఆఫీస్ పేరుతో అక్రమాలు': ప్రభుత్వ భూముల ఆక్రమణపై తీవ్ర విమర్శలు
రిపోర్టర్: హరి
స్థలం: Hyderabad
బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కోసం కేటాయించిన ఒక ఎకరం భూమి కంటే ఎక్కువగా ఆక్రమించి స్వాధీనంలో ఉంచుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. పార్టీ కార్యాలయాల కోసం కేటాయించిన భూమిని ఎలాంటి వ్యాపార లేదా నివాస అవసరాలకు వాడకూడదని, నిబంధనలు అతిక్రమిస్తే భూమిని ప్రభుత్వం ఉచితంగా తిరిగి స్వాధీనం చేసుకుంటుందని జీవో నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.