రాష్ట్రంలో నాలుగు కొత్త పోలీస్‌ కమిషనరేట్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: అమరావతి

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో రాజమహేంద్రవరం, గుంటూరు, తిరుపతి, కర్నూలు కేంద్రాలుగా నాలుగు కొత్త పోలీస్‌ కమిషనరేట్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దాదాపు 60కి పైగా అజెండా అంశాలతో కొనసాగిన ఈ భేటీలో భారీ పెట్టుబడులు, అమరావతి మౌలిక వసతుల విస్తరణ, ప్రభుత్వ శాఖల్లో 10,060 పోస్టుల భర్తీతో పాటు పలు కీలక ప్రతిపాదనలకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.