నా భూములు చూసేందుకు వస్తే స్వయంగా భోజనం పెడతాను అంటూ హరీశ్ రావు కౌంటర్

రిపోర్టర్: కృష్ణ స్థలం: సిద్దిపేట

తన భూములను పరిశీలించేందుకు వస్తున్న కాంగ్రెస్ నాయకులకు బీఆర్ఎస్ సీనియర్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఆసక్తికరమైన కౌంటర్ ఇచ్చారు. తనకు ముందే సమాచారం అందించి వస్తే స్వయంగా అన్ని ఏర్పాట్లు చేసి, ఆప్యాయంగా భోజన వసతి కల్పించి మరీ తన పొలాలను చూపిస్తానని ఆయన ఆఫర్ చేశారు. శుక్రవారం సిద్దిపేటలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ పార్టీ నేతల వైఖరిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.