'50 కేజీల కుళ్లిన మాంసం సీజ్': ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు

రిపోర్టర్: గోపి స్థలం: Telangana

రాష్ట్రంలో ఆహార భద్రతపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా నిర్వహించిన తనిఖీల్లో భారీగా కల్తీ మరియు కుళ్లిన పదార్థాలు బయటపడ్డాయి. ఏకంగా 50 కేజీల కుళ్లిన చికెన్, మటన్, రొయ్యలతో పాటు గడువు ముగిసిన ఇతర ఆహార పదార్థాలను అధికారులు గుర్తించి సీజ్ చేశారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న హోటళ్లు మరియు రెస్టారెంట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.