విద్యార్థుల యూనిఫామ్‌లు ఆకర్షణీయమైన రంగుల్లో ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
రిపోర్టర్: రాజేష్
స్థలం: హైదరాబాద్
విద్యార్థులకు పంపిణీ చేసే యూనిఫామ్‌లు మరింత ఆకర్షణీయమైన రంగుల్లో ఉండాలని హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, రెసిడెన్షియల్స్ విద్యార్థులకు యూనిఫామ్‌లు, నోట్ పుస్తకాల పంపిణీపై ఆయన శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ నెలాఖరులోగా రెండో జత యూనిఫామ్ అందజేస్తామని అధికారులు తెలిపారు. వచ్చే విద్యాసంవత్సరం స్కూళ్లు తెరిచిన రోజే అన్ని సామగ్రి అందేలా ఇప్పటి నుంచే ప్రణాళిక రూపొందించాలని సీఎం స్పష్టం చేశారు.