ఈసీ నిర్ణయంపై తేజస్వీ యాదవ్ ధ్వజం: మోదీకి తొత్తుగా మారారంటూ ఫైర్

రిపోర్టర్: రాజేష్ స్థలం: ఢిల్లీ

దేశ రాజధాని ఢిల్లీలోని రాంలీలా మైదాన్ వేదికగా జరిగిన ఇండియా కూటమి సభలో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కేంద్ర ఎన్నికల సంఘంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో రాజకీయ కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. ముఖ్య ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ మోదీకి తొత్తులా వ్యవహరిస్తున్నారని, ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని తేజస్వీ యాదవ్ డిమాండ్ చేశారు.