దిల్లీలో ఉద్రిక్తత: నేమ్ ట్యాగ్లు లేకుండా విధుల్లో పాల్గొన్న పోలీసు సిబ్బంది
రిపోర్టర్: కృష్ణ
స్థలం: New Delhi
దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద సీఈసీ జ్ఞానేశ్ కుమార్ వ్యతిరేక ఆందోళనల్లో భద్రతా సిబ్బంది ట్యాగ్లు లేకుండా కనిపించడంపై పోలీసులు కీలక స్పష్టతనిచ్చారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత వేధింపులు, టార్గెట్ చేయడాన్ని నివారించేందుకే తాము ఉద్దేశపూర్వకంగానే వాటిని తొలగించినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. గతేడాది జరిగిన ఘర్షణల నేపథ్యంలో అధికారుల కుటుంబాల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ ముందస్తు చర్యలు చేపట్టినట్లు అధికార వర్గాలు స్పష్టం చేశాయి.