రైతు భరోసా మోసం: కౌలు రైతులను అరిగోస పెడుతున్నారంటూ రేవంత్ సర్కార్‌పై కేసీఆర్ ఫైర్
రిపోర్టర్: కిరణ్
స్థలం: Telangana
ఎన్నికల సమయంలో కౌలు రైతులకు ఏడాదికి పదిహేను వేల రూపాయల రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వాగ్దానాన్ని విస్మరించారని, పండించిన పంటలకు కనీసం సాగునీరు కూడా అందించకుండా అన్నదాతలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాల వల్ల క్షేత్రస్థాయిలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.