తెలంగాణకు కన్నీళ్లు తెప్పిస్తున్నారంటూ రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
రిపోర్టర్: సతీష్
స్థలం: తెలంగాణ
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రాకేమో నీళ్లు, తెలంగాణకు కన్నీళ్లు అనేలా దుస్థితి దాపురించిందని బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని పంప్‌హౌస్‌లను ఆన్ చేసి నీటిని తరలిస్తుంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం కృష్ణా నదిలో నీరున్నా మోటార్లు ఆన్ చేయడం లేదని ధ్వజమెత్తారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కృత్రిమ కరువు అని ఆయన ఘాటుగా విమర్శించారు.