తిరుమలలో ఘనంగా గజవాహన సేవ వేడుకలు
రిపోర్టర్: అశోక్
స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు గజ వాహన సేవలో శ్రీ మలయప్పస్వామివారు భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. ఈ వేడుకల్లో పాల్గొన్న వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్ర ప్రజలందరూ ఆ శ్రీనివాసుడి కృపాకటాక్షాలతో సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆ దేవుడిని ప్రత్యేకంగా ప్రార్థించినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.