వరి ధాన్యం కొనుగోళ్లలో రైతులకు శుభవార్త: క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందజేత
రిపోర్టర్: భాస్కర్
స్థలం: సూర్యాపేట
ప్రస్తుతం కొనసాగుతున్న వరి ధాన్యం సేకరణ సీజన్లో రైతులకు కనీస మద్దతు ధరతో పాటు క్వింటాల్‌కు అదనంగా ఐదు వందల రూపాయల బోనస్‌ను అందిస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో చేపట్టిన ఈ కార్యక్రమం రైతుల ఆదాయాన్ని పెంచడం, వారి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కేలా చూడటమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని ప్రభుత్వం స్పష్టం చేసింది.