కేరళ వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అరుదైన పురస్కారం

రిపోర్టర్: రమేష్ స్థలం: కేరళ

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి కేరళలోని నిలంబూర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆర్యదాన్ ముహమ్మద్ బెస్ట్ పబ్లిక్ సర్వెంట్ అవార్డు దక్కినట్లు నిర్వాహకులు తెలిపారు. దివంగత నేత ఆర్యదాన్ ముహమ్మద్ స్మారకార్థం ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ఈ పురస్కారాన్ని కేరళ వేదికగా ఘనంగా అందజేశారు. రాష్ట్రంలో ఆయన చేపట్టిన సంక్షేమ పథకాలు, ప్రజానుకూల పాలనా వైఖరిని గుర్తించి జ్యూరీ సభ్యులు ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు ఏఐసీసీ ముఖ్య నేతలు వెల్లడించారు.