ఏలూరులో నకిలీ డీఎస్పీ అరెస్ట్: భారీ మోసాలు గుట్టురట్టు చేసిన పోలీసులు
రిపోర్టర్: శివ
స్థలం: ఏలూరు
సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో డీఎస్పీ అవతారమెత్తిన అంతరాష్ట్ర మోసగాడిని ఏలూరు పోలీసులు అరెస్ట్ చేశారని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వెల్లడించారు. పది వరకు మాత్రమే చదివిన బత్తుల శ్రీనివాస్ పోలీసు దుస్తులు ధరించి, నిరుద్యోగులకు ఉద్యోగాల పేరుతో లక్షలు వసూలు చేశాడని తెలిపారు. బాధితుల ఫిర్యాదుతో నిందితుడిని అదుపులోకి తీసుకుని, నగదుతో పాటు నకిలీ నియామక పత్రాలు, వాకీటాకీలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ స్పష్టం చేశారు.