హైదరాబాద్ లో మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పై సెక్యూరిటీ గార్డ్ లైంగిక వేధింపులు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇందిరానగర్‌లో క్యాబ్ ఎక్కుతున్న 24 ఏళ్ల మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌పై సెక్యూరిటీ గార్డ్ రాజ్ కుమార్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆఫీసుకు వెళ్తుండగా ఆమెను బలవంతంగా ముద్దుపెట్టిన నిందితుడు, బాధితురాలు కేకలు వేయడంతో పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు.