హైదరాబాద్ లో చైన్ స్నాచర్ అరెస్ట్: బంగారు గొలుసు, వాహనం స్వాధీనం చేసుకున్న పోలీసులు

రిపోర్టర్: వెంకట్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్ లో జరిగిన చైన్ స్నాచింగ్ ఘటనపై కమిషనర్ టాస్క్ ఫోర్స్, సఈదాబాద్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు Hyderabad City Police వెల్లడించారు. బాలాపూర్ ప్రాంతానికి చెందిన బైక్ మెకానిక్ మొహమ్మద్ ఘౌస్ పాషాను అదుపులోకి తీసుకున్నామని, అతడి వద్ద నుంచి పదిహేడు గ్రాముల బంగారు గొలుసుతో పాటు నేరానికి ఉపయోగించిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.