రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై త్వరలోనే ఒప్పందం కుదురుతుందన్న డొనాల్డ్ ట్రంప్
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: కీవ్
రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ రష్యా అధినేత పుతిన్‌తో మాట్లాడి త్వరలో ఓ ఒప్పందానికి వస్తారని ఆశిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. ఐక్యరాజ్యసమితి సమావేశంలో భాగంగా జెలెన్స్కీతో భేటీ అయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలు వెల్లడించారు. శీతాకాలానికి ముందే ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ట్రంప్ పేర్కొన్నారు.