ఈ ఏడాది వినాయక చవితి తేదీపై పండితుల స్పష్టత

రిపోర్టర్: రాము స్థలం: India

ఈ ఏడాది వినాయక చవితి జరుపుకునే తేదీపై నెలకొన్న సందిగ్ధతకు పండితులు తెరదించారు. భాద్రపద శుద్ధ చవితి తిథి మధ్యాహ్న వ్యాప్తిని బట్టి సెప్టెంబర్ 14 సోమవారమే వినాయక చవితి పండుగను జరుపుకోవాలని స్పష్టం చేశారు. అదే రోజు విగ్రహ ప్రతిష్ఠాపనకు అభిజిత్ ముహూర్తంతో పాటు పలు శుభ ముహూర్తాలు ఉన్నట్లు వెల్లడించారు. భక్తులు ఈ నిబంధనల ప్రకారం పూజలు నిర్వహించుకోవాలని సూచించారు.