అర్నబ్ తుఫాన్ బీభత్సం: సాధారణ పరిస్థితులు నెలకొనేంత వరకు యంత్రాంగం విశ్రమించవద్దు

రిపోర్టర్: నరేష్ స్థలం: అమరావతి

అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేంత వరకు అధికార యంత్రాంగం విశ్రమించకూడదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అమరావతిలో ఉన్నతాధికారులు మరియు కలెక్టర్లతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో ఆయన సహాయక చర్యలు, పునరుద్ధరణ పనులపై సమీక్షించారు. విపత్తు వేళ ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించిన యంత్రాంగాన్ని అభినందిస్తూ, యుద్ధప్రాతిపదికన మిగిలిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. బాధితులకు తక్షణ నష్టపరిహారం అందించాలని, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని సూచించారు.