డిసెంబర్ రేసు నుంచి ప్రభాస్ ఫౌజీ సినిమా తప్పుకుంటుందా?
రిపోర్టర్: విజయ్
స్థలం: తెలంగాణ
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఫౌజీ' సినిమా డిసెంబర్ విడుదలపై సందిగ్ధత నెలకొంది. షూటింగ్ ఇంకా పూర్తికాకపోవడంతో ఈ చిత్రం రేసు నుంచి తప్పుకునే అవకాశం ఉందని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. ప్రభాస్ తప్పుకుంటే ఆ స్థానంలో విశ్వక్ సేన్ 'లెగసీ', నాగచైతన్య 'వృషకర్మ' సినిమాలు డిసెంబర్ మొదటి వారంలో బరిలోకి దిగడానికి సిద్ధమవుతున్నాయి.