'ప్రతి రూ.10 పెరుగుదలపై రూ.40 కోట్ల లాభం': ఎన్‌ఎస్‌ఈ షేర్లపై రాధాకిషన్‌ దమానీ

రిపోర్టర్: సునీల్ స్థలం: భారతదేశం

నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ ఎన్‌ఎస్‌ఈ షేర్లు ఆకర్షణీయంగా లిస్ట్‌ అయితే డి-మార్ట్‌ అధిపతి రాధాకిషన్‌ దమానీకి భారీ లాభాల పంట పండనుంది. ఇష్యూ ధర నుంచి షేరు ధర ప్రతి రూ.10 పెరిగితే ఆయన పెట్టుబడి విలువకు రూ.40 కోట్లు జతకానున్నాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో దమానీకి 3.91 కోట్ల షేర్లు ఉండగా ఐపీఓ గరిష్ఠ ధర ప్రకారం ఈ పెట్టుబడి విలువ సుమారు రూ.6,980 కోట్లుగా ఉంది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా షేర్లు విక్రయిస్తున్న వాటాదార్లు పెట్టిన రూ.534 కోట్ల పెట్టుబడికి ఏకంగా రూ.16,501 కోట్ల లాభం రానుంది.