ఎన్నికల సంఘంపై రాహుల్ ఆరోపణలు హాస్యాస్పదమన్న బీజేపీ నేత నల్లా పవన్

రిపోర్టర్: Y.V.RAMANA స్థలం: అమలాపురం

ఎన్నికల ప్రక్రియ మరియు ఓటర్ల జాబితాపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలు ప్రజల్లో గందరగోళం సృష్టించేలా ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్కుమార్ విమర్శించారు. అమలాపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సంఘంపై అసత్య ఆరోపణలు చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయని ఆయన తెలిపారు.