షార్ట్ ఫిలిం పేరుతో మోసం చేసిన నటి వర్షిణి అరెస్ట్

రిపోర్టర్: అశోక్ స్థలం: చెన్నై

చెన్నైలో షార్ట్ ఫిలిం నిర్మిస్తానని చెప్పి ఓ వ్యక్తి నుంచి రూ. 5 లక్షలు తీసుకుని మోసం చేసిన టీవీ రియాల్టీ షో నటి వర్షిణి వెంకట్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుడు డబ్బులు వెనక్కి అడగడంతో గిండి ప్రాంతంలో ఆమె అతడిని బెదిరించి, రూ. 50 వేల నగదుతో పాటు రెండు మొబైల్ ఫోన్లను లాక్కున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు వర్షిణి సహా మరో ముగ్గురిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.