ముంబైలో బీభత్సం సృష్టించిన ఎలక్ట్రిక్ కారు మరియు పలువురికి గాయాలు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: ముంబై
ముంబైలోని ఖార్ వెస్ట్ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున ఒక అతివేగంగా దూసుకెళ్లిన ఎలక్ట్రిక్ కారు బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో 19 ఏళ్ల కాలేజీ విద్యార్థిని స్టేసి పెరీరాతో పాటు ఒక పోలీసు కానిస్టేబుల్, పలువురు ఆటో డ్రైవర్లు తీవ్రంగా గాయపడ్డారు. నిందితులైన డ్రైవర్ దినేష్ యాదవ్, కారు యజమాని మెహుల్ జోషిలపై ఖార్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.