అమెరికా తమ దేశంపై దాడి చేస్తుందని అంచనా వేశామన్న కెనడా ప్రధాని మార్క్ కార్నీ

రిపోర్టర్: భాస్కర్ స్థలం: ఒట్టావా

అమెరికా తమ దేశంపై దాడి చేసే అవకాశం ఉందనే ఉద్దేశంతో ప్రతిదాడికి సిద్ధమయ్యామని కెనడా ప్రధాని మార్క్ కార్నీ సంచలన వ్యాఖ్యలు చేశారు. డొనాల్డ్ ట్రంప్ కెనడాను 51వ రాష్ట్రంగా మార్చాలంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ముందస్తు ప్రణాళికలు రూపొందించినట్లు ఆయన తెలిపారు. అయితే ప్రస్తుతం అలాంటి ముప్పు లేదని స్పష్టం చేస్తూ, అత్యంత అరుదైన పరిస్థితులను పరిశీలించడం ప్రధానిగా తన బాధ్యతని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.