నా కెరీర్‌లోనే అత్యంత ప్రత్యేకం ది ప్యారడైజ్ సినిమా
రిపోర్టర్: రాజేష్
స్థలం: బెంగళూరు
అగ్ర కథానాయకుడు నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన పీరియడ్ యాక్షన్ డ్రామా ది ప్యారడైజ్ ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో బెంగళూరులో జరిగిన ప్రెస్‌మీట్‌లో నాని మాట్లాడుతూ ప్యారడైజ్ తన కెరీర్‌లోనే అత్యంత ప్రత్యేకమైన సినిమా అని, ఎక్కువ రోజులు షూటింగ్ చేసి ఎంతో కష్టపడ్డామని తెలిపారు. ఇది తల్లీకొడుకుల మధ్య భావోద్వేగాలతో కూడిన అద్భుతమైన యాక్షన్ చిత్రమని పేర్కొన్నారు.