'సచిన్ రికార్డు బ్రేక్': వన్డేల్లో సరికొత్త చరిత్ర సృష్టించిన టేలర్
రిపోర్టర్: కృష్ణ
స్థలం: World
పురుషుల అంతర్జాతీయ వన్డే క్రికెట్ చరిత్రలో జింబాబ్వే వికెట్ కీపర్ బ్యాటర్ బ్రెండన్ టేలర్ సరికొత్త రికార్డు నమోదు చేశాడు. హరారే వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో బరిలోకి దిగడం ద్వారా టీమ్ ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఆల్ టైమ్ వరల్డ్ రికార్డును అతడు అధిగమించాడు. ప్రస్తుతం టేలర్ వన్డే కెరీర్ కాల వ్యవధి 22 ఏళ్ల 148 రోజులకు చేరుకోగా, సచిన్ పేరిట ఉన్న 22 ఏళ్ల 91 రోజుల రికార్డు రెండో స్థానానికి పడిపోయింది.