బాసర అమ్మవారికి అక్షరమాలతో కూడిన ప్రత్యేక చేనేత పట్టుచీర సమర్పణ

రిపోర్టర్: నరేష్ స్థలం: నిర్మల్

నిర్మల్ జిల్లా బాసర సరస్వతీ అమ్మవారికి సిరిసిల్లకు చెందిన జగదీష్ అక్షరమాలతో కూడిన ప్రత్యేక పట్టుచీరను కానుకగా సమర్పించారు. 15 రోజుల పాటు శ్రమించి మగ్గంపై నేసిన ఈ 6 మీటర్ల చీరను ఆలయ ఈవో అంజనీ దేవికి అందజేశారు. అక్షరాభ్యాస క్షేత్రమైన బాసరలో అమ్మవారికి అక్షరమాలతో కూడిన చీరను సమర్పించడం భక్తుల మధ్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.