ఇకపై రొటీన్ కామెడీ హీరోగా సినిమాలు చేయను: సంపూర్ణేష్ బాబు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: తెలంగాణ

కామెడీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సంపూర్ణేష్ బాబు ఇకపై ఆ తరహా సినిమాలు చేయనని స్పష్టం చేశారు. నాని 'ది ప్యారడైజ్' చిత్రంలో పూర్తి సీరియస్ మరియు డిఫరెంట్ పాత్ర చేస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమా తర్వాత హీరోగా కాకుండా కేవలం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే నటిస్తానని, కొత్త రకమైన పాత్రలను మాత్రమే ఎంచుకుంటానని ఆయన వెల్లడించారు.