దుందుభి తీరాన కొలువుదీరిన చారిత్రక ఏకశిల గణపతి
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: తిమ్మాజిపేట
నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం ఆవంచ గ్రామ సమీపంలోని దుందుభి నది తీరాన పచ్చటి పొలాల మధ్య ఎత్తైన ఏకశిల గణపతి విగ్రహం కొలువుదీరింది. 12వ శతాబ్దంలో పశ్చిమ చాళుక్యుల రాజు తైలంపుడు నల్లటి గుండుపై ముప్పై అడుగుల ఎత్తైన గణపతి రాతి విగ్రహాన్ని చెక్కించాడని శాసనాల ద్వారా తెలుస్తోంది. ఐశ్వర్య గణపతిగా, గుండు గణపతిగా ప్రఖ్యాతి గాంచిన ఈ మహా విగ్రహాన్ని దర్శించేందుకు ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు.