జైపూర్ గురుకులంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలతో దడదడ

రిపోర్టర్: R.RAVINDER స్థలం: మంచిర్యాల

మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతి గదులు, వంటశాలను పరిశీలించి విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టిక ఆహారం అందించాలని ఆదేశించారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించాలని ఆయన సూచించారు.