ఇరాడపల్లి ఎంపీటీసీ స్థానానికి సీపీఎం అభ్యర్థిగా సీదారి జగన్ ఎంపిక
రిపోర్టర్: SINDERI KAMESH
స్థలం: పాడేరు
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం ఇరాడపల్లి పంచాయతీ ఎంపీటీసీ స్థానానికి సీపీఎం పార్టీ తరఫున సీదారి జగన్ను అభ్యర్థిగా ఎంపిక చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో ఆయన పార్టీ తరఫున బరిలో నిలవనున్నారు. పాడేరు మండలంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు అందరూ సమష్టిగా కృషి చేయాలని పార్టీ శ్రేణులు పిలుపునిచ్చాయి.