హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ ఘటనపై స్పందించిన డీజీపీ సీవీ ఆనంద్
రిపోర్టర్: సతీష్
స్థలం: హఫీజ్‌పేట్
హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ వద్ద మహిళపై దాడి ఘటనపై డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టతనిచ్చారు. ఈ ఘటనకు పాల్పడిన హోమ్ గార్డ్ రైల్వే పోలీస్ ఫోర్స్‌లో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నాడని తెలిపారు. నిందితుడిని సర్వీస్ నుంచి పూర్తిగా తొలగించడంతో పాటు అతడిపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు డీజీపీ వెల్లడించారు.