అర్నబ్ తుపాన్ ప్రభావం: విజయవాడలో కొండ ప్రాంత ప్రజల సురక్షిత తరలింపు
రిపోర్టర్: సురేష్
స్థలం: విజయవాడ
రాష్ట్రంలో అర్నబ్ తుపాన్ ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు భద్రతా చర్యలు చేపట్టారు. కొండ ప్రాంతాల్లో ప్రమాదకర పరిస్థితుల్లో నివసిస్తున్న ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియను వేగవంతం చేశారు. భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున చిట్టినగర్, మొగల్రాజపురం ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి, ప్రత్యేక పునరావాస కేంద్రాలకు ప్రజలను తరలించి వారికి వసతులు కల్పిస్తున్నారు.