బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న నాని ది ప్యారడైజ్
రిపోర్టర్: రమేష్
స్థలం: హైదరాబాద్
నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 'ది ప్యారడైజ్' చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. ఈ సినిమా విడుదలైన తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 88 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను రాబట్టి ఘన విజయం సాధించిందని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అనిరుధ్ రవిచందర్ సంగీతం, నాని నటన ప్రధాన ఆకర్షణగా నిలిచాయని ప్రేక్షకులు కొనియాడుతున్నారు.