వైద్యరంగంలో మరో కీలక మైలురాయి: అనంతపురంలో కిమ్స్ సవేరా కొత్త బ్లాకులు ప్రారంభం

రిపోర్టర్: రాజేష్ స్థలం: అనంతపురం

రాయలసీమ ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా అనంతపురంలోని కిమ్స్ సవేరా ఆసుపత్రిని 500 పడకల సామర్థ్యంతో విస్తరించినట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆదివారం నూతనంగా ఏర్పాటు చేసిన స్పెషాలిటీ మెడికల్ బ్లాక్లను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తో కలిసి ఆయన ప్రారంభించారు. ఇకపై సంక్లిష్టమైన వైద్యం కోసం రోగులు ఇతర మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని ఆసుపత్రి యాజమాన్యం స్పష్టం చేసింది.