ఖమ్మంలో అఖిల భారత రైతు కూలీ సంఘం మహాసభలు ప్రారంభం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఖమ్మం
రైతు కూలీల హక్కుల పరిరక్షణ కోసం పోరాడే దిశగా అఖిల భారత రైతు కూలీ సంఘం జాతీయ నాలుగో మహాసభలు ఖమ్మం నగరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. విప్లవ గేయాల హోరు, అమరవీరుల నినాదాల మధ్య సంఘం జాతీయ అధ్యక్షుడు వేములపల్లి వెంకట్రామయ్య జెండా ఆవిష్కరించారు. ఈ సదస్సులో దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతాల నుంచి కార్మిక, కర్షక ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.