గ్రామసభల నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యపు రాతిగుండెలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: దేవరాపల్లి
భారత రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా దేవరాపల్లి మండలంలో గ్రామసభలను తూతూమంత్రంగా నిర్వహిస్తున్నారని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు కె.వి.రమణ తీవ్రంగా ఆరోపించారు. షెడ్యూల్ విడుదల చేయకుండా ఒకే రోజు గ్రామసభలు జరిపించడం అధికారుల వైఫల్యానికి నిదర్శనమని మండిపడ్డారు. పారదర్శకత లేకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు.