అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న వెంకటేష్ త్రివిక్రమ్ ఆదర్శ కుటుంబం చిత్రం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: హైదరాబాద్
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబం సినిమా విడుదల వాయిదా పడింది. సాంకేతిక కారణాల వల్ల అక్టోబర్ 9వ తేదీన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ ఎత్తున విడుదల కానుంది. అలాగే ఈ రోజు విడుదల కావాల్సిన నారాయణమ్మ మొదటి సింగిల్ పాటను కూడా వాయిదా వేసినట్లు మేకర్స్ తెలిపారు.