చైనా వీధుల్లో చెత్తాచెదారం: మన దేశంపైనే ఎందుకంత దుష్ప్రచారం అని బ్లాగర్ నిలదీత

రిపోర్టర్: హరి స్థలం: హైదరాబాద్

చైనాలోని గ్వాంగ్జౌ నగరంలో కనిపించిన చెత్తాచెదారంతో కూడిన ఇరుకు వీధులు భారత దేశం వాతావరణాన్ని తలపించాయని సోషల్ మీడియా బ్లాగర్ ప్రణవ్ తెలిపారు. భారతదేశాన్ని మాత్రమే అపరిశుభ్ర దేశంగా ఎందుకు నిందిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విదేశాల్లోనూ ఇలాంటి మురికి ప్రాంతాలు ఉంటాయని, భారత్ను మాత్రమే అప్రతిష్టపాలు చేయడం సరికాదని ప్రణవ్ ప్రశ్నించారు. ఈ వీడియో ప్రస్తుతం అంతర్జాలంలో తీవ్ర చర్చకు దారితీసింది.