విద్యార్థుల యూనిఫాం డిజైన్లలో వైవిధ్యం ఉండాలన్న సీఎం రేవంత్

రిపోర్టర్: రాము స్థలం: తెలంగాణ

విద్యార్థులకు అందించే యూనిఫాంలు మరింత ఆకర్షణీయమైన రంగుల్లో ఉండాలని, డిజైన్లలో వైవిధ్యానికి ప్రయత్నించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు అందించే యూనిఫాంలు మరియు ఇతర పాఠశాల సామగ్రి పంపిణీపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన ఈ కీలక ఆదేశాలు జారీ చేశారు.