శంషాబాద్లో ఘనంగా ఓ నా సిద్ధయ్య ఆల్బమ్ సాంగ్ లాంచ్
రిపోర్టర్: సునీల్
స్థలం: శంషాబాద్
భారతీయ సినీ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరలేపుతూ శంషాబాద్ ప్రభుత్వ కళాశాల మైదానంలో 'ఓ నా సిద్ధయ్య' ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ లాంచ్ వేడుక అత్యంత వైభవంగా జరిగిందని నిర్వాహకులు తెలిపారు. భారతదేశంలోనే తొలిసారిగా అవుట్డోర్ వేదికపై డాల్బీ అట్మాస్ సౌండ్తో ఈ పాటను విడుదల చేశారు. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఐదు వేల మందికి పైగా ప్రేక్షకులు ఈ వేడుకకు తరలివచ్చి చిత్ర యూనిట్ను ఉత్సాహపరిచారు.