భోగాపురం మండలంలో బొటానిక్ ఇండస్ట్రీస్ ప్రారంభం: ఎమ్మెల్యే లోకం నాగ మాధవి
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం భోగాపురం మండలంలో బొటానిక్ ఇండస్ట్రీస్‌ను లాంఛనంగా ప్రారంభించినట్లు నెల్లిమర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే లోకం నాగ మాధవి వెల్లడించారు. ఈ నూతన పరిశ్రమ ఏర్పాటు ద్వారా స్థానిక ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి మరింత వేగవంతం కావడంతో పాటు, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆమె పేర్కొన్నారు. పారిశ్రామిక రంగానికి ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేయడం జరిగింది.