'రూ.5.50 కోట్లతో అభివృద్ధి పనులు': కొణతాల రామకృష్ణ పరిశీలన
రిపోర్టర్: హరి
స్థలం: అనకాపల్లి
అనకాపల్లి నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా 80వ వార్డు పరిధిలోని విలీన గ్రామాల్లో రూ.5.50 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను కొణతాల రామకృష్ణ పరిశీలించారు. రాజుపాలెం, గొర్లివానిపాలెం, వల్లూరు, ఎరుకువానిపాలెం గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో సమీక్షించి, ప్రజలకు మెరుగైన వసతులు కల్పించేలా చర్యలు చేపడతామని కొణతాల రామకృష్ణ స్పష్టం చేశారు.