భక్తిశ్రద్ధలతో వైభవంగా ప్రారంభమైన గణనాథుల నవరాత్రి ఉత్సవాలు

రిపోర్టర్: bhukya Narasimha rao స్థలం: జులూరుపాడు

జులూరుపాడు మండలంలో వివిధ గ్రామాలలో వరసిద్ధి వినాయకుని నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. గ్రామాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపాలలో గణనాథులను విగ్రహాలను భక్తిశ్రద్ధలతో ప్రతిష్టించడం జరిగింది. ఈ పూజా కార్యక్రమంలో ఆయా కమిటీల సభ్యులు, గ్రామ ప్రజలు, పెద్దలు, చిన్నలు భారీ సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదటి రోజు గణేశుడి దర్శనార్థం మండపాలకు భక్తులు పోటెత్తడంతో పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంది.